మా గ్రామానికి ఆరు డైరెక్టర్ పదవులు ఇవ్వాలి...

06-10-2026 | 07:11pm

లేదంటే కార్యకలాపాలు సాగనివ్వం...

తాడ్వాయి,అక్టోబర్, 06( విజయక్రాంతి): మా గ్రామానికి సింగిల్ విండోలో ఆరు డైరెక్టర్ పదవులు ఇవ్వాలి,లేదంటే సింగిల్ విండో లో కార్యకలాపాలు సాగనివ్వమని దేమికలాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు(Demikalan Congress Party leaders), రైతులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో మంగళవారం వారు మాట్లాడుతూ... ఎప్పుడు సింగిల్ విండో కు ఎన్నికలు జరిగినా దేమికలాన్ గ్రామానికి ఆరు డైరెక్టర్ పదవులు ఉంటాయని తెలిపారు.

కానీ అందుకు విరుద్ధంగా దేమికలాన్ గ్రామానికి ప్రస్తుతం ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు రెండు డైరెక్టర్ పదవులు మాత్రమే ఇచ్చారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి మా గ్రామానికి ఆరు డైరెక్టర్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గడ్డ బాలరాజు, ఉపాధ్యక్షులు సాయ గౌడ్, నాయకులు పౌరాజు,సంగారావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు