మిషన్ భగీరథ కార్మికులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి అండ

06-10-2026 | 08:23pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మిషన్ భగీరథలో పనిచేస్తున్న సుమారు 600 మంది కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధనోరాలోని మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) అక్కడికి చేరుకుని కార్మికులకు మద్దతు తెలిపారు. పెండింగ్ జీతాల సమస్యను వెంటనే పరిష్కరించాలని మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి సూచించారు. జీతాలు అందక కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు