డ్రోన్ తో నానో యూరియా వాడకంపై రైతులకు క్షేత్ర స్థాయి ప్రదర్శన

08-09-2026 | 07:52pm

మండల వ్యవసాయ శాఖ అధికారి ఓ.ఫైజుల్లా

బాన్సువాడ, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని పంట శివారులో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి ఓ.ఫైజుల్లా(Mandal Agriculture Department Officer O. Faizullah) డ్రోన్ తో నానో యూరియా (Nano urea)వాడకంపై  రైతులకు క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది, నానో యూరియా ను వాడటం వలన నేల కాలుష్యం    నివారించవచ్చు,డ్రోన్ లను ఉపయోగించి కూలీల బెడద తప్పించవచు ,అలాగే జీవన ఎరువులు వాడుకోవటం వలన భూమిలో  లభ్యం కానీ ఎరువులు లభ్యం అయ్యేలా ఉపయోగపడతాయని ఫైజుల్ల రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కావ్య శ్రీ,రైతులు, అశోక్,నగేష్, కృష్ణ, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు