విద్యార్థులకు కంటి పరీక్షలు

13-11-2026 | 01:17pm

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Peddamallareddy ZP High School)లో శుక్రవారం విద్యార్థులకు కంటి పరీక్షల(Eye Tests) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో రిఫ్రాక్టోమీటర్ ద్వారా విద్యార్థుల దృష్టిని పరీక్షించి, కంటి వక్రీభవన లోపాలను గుర్తించారు. దృష్టి సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన కళ్లద్దాలను సిఫార్సు చేశారు.

ఈ కార్యక్రమాన్ని దోమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఆప్తాల్మిక్ ఆఫీసర్ రవీందర్ పటేల్ నిర్వహించారు. విద్యార్థులు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, హెల్త్ ఎడ్యుకేటర్ భీమ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు