అర్హులందరికీ "చేయూత"నిస్తాం.. అండగా నిలుస్తాం
కవితను మర్యాదపూర్వకంగా కలిసిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్
గంభీరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ(Telangana Rakshana Sena Party) అధినేత్రి కల్వకుంట్ల కవితను గంభీరావుపేట మండల(Gambhiraopet Mandal) కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్(TRS Youth Wing Vice President Syed Sadiq) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు సుమలత -సుధాకర్ శర్మతో కలిసి హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్ష పదవి అప్పగించినందుకు కవితకు సయ్యద్ సాదిక్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కవితతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఈ భేటీలో జిల్లా నాయకులు వర్ధ సతీష్, జిల్లా యువజన నాయకుడు పూసల వినయ్, మండల ఇన్చార్జి కూర సురేష్ పటేల్,మండల మైనారిటీ అధ్యక్షుడు అస్లాం ఖాన్,ముస్తాబాద్ మండల ఇన్చార్జి ఎడ్ల రమేష్, మక్బూల్ ఖాన్, అర్ఫాత్ ఖాన్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.