అధిక దిగుబడులపై రైతులకు అవగాహన

13-11-2026 | 12:49pm

చెన్నూర్,(విజయక్రాంతి): పంటల సాగు అధిక దిగుబడులపై ఎల్ఎస్ఆర్ సీడ్స్ కంపెనీ(LSR Seeds Company) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో బొమ్మెన సత్యనారాయణ రెడ్డి  పత్తి చేనులో ఎస్బి "ఫిదా" బీజీ 2 అనే పత్తి రకం ఏపుగా పెరగటానికి రైతు పాటించిన పద్దతి పై  క్షేత్రస్థాయిలో ప్రదర్శన, పరిశీలన రైతులతో కలిసి చేపట్టారు. ఆరు గ్రామాల నుంచి 189 మంది రైతులు వీక్షించారు.

కంపెనీ ప్రతినిధులు ఆర్ఎస్ఎం  నాంపల్లి తిరుపతి  డిస్ట్రిబ్యూటర్ లావణ్య  ఫెర్టిలైజర్ డీలర్స్, సుందరశాల, శ్రీ శివ కృష్ణ ఏజెన్సీస్.ముత్తేరావుపెల్లి కంపెనీ ప్రతినిధులు ఆర్ఎస్ఎం నాంపల్లి తిరుపతి మాట్లాడుతూ "ఫిదా" బిజీ 2 విత్తనము చాలా బరువైన కాయ పెద్ద కాయలు, ఎక్కువ కొమ్మలు వస్తుందని, అలాగే దిగుబడిని ఎక్కువగా ఇస్తుందన్నారు.  పురుగు  దోమ,పేను బంక మొదలగు తెగుళ్ళని తట్టుకోగల శక్తి ఉంటుందని వివరించారు. రైతు బి. సత్యనారాయణ రెడ్డి ని సన్మానించారు. సేల్స్ ఆఫీసర్లు G. రామకృష్ణ గౌడ్ ,P. జీవన్ ( మంథని), K. నరేష్ (ఆసిఫాబాద్), G సత్యనారాయణ  (లక్షెట్టిపేట) పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు