కేటీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి పువ్వాడ
13-11-2026 | 01:24pm
ఖమ్మం,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) హైదరాబాద్ కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం రాజకీయ తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించారు. ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులను కేటీఆర్ కు వివరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియపై సమీక్షించారు.