16 నుంచి ప్రత్యేక పిల్లల ప్రజావాణి

13-11-2026 | 12:47pm

బాలల సమస్యలపై నేరుగా అర్జీల స్వీకరణ.. కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఈ నెల 16న సోమవారం ఉదయం 10:30 గంటలకు సాధారణ ప్రజావాణితో పాటు ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి(Children Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లల హక్కుల ఉల్లంఘన, భద్రత, విద్య, ఆరోగ్యం, పోషకాహారం తదితర సమస్యలపై బాలబాలికల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమస్యలను పరిష్కరించడంతో పాటు పిల్లల వివరాల గోప్యతను పాటిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

మరిన్ని వార్తలు