తీన్మార్ మల్లన్న కారు నుజ్జునుజ్జు.. బీసీ పాదయాత్ర వాయిదా

13-11-2026 | 01:07pm

ముగ్గురికి ప్రాణాపాయం

లారీ ఢీకొని ధ్వంసమైన కారు

తాత్కాలికంగా పాదయాత్ర వాయిదా

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న నాయకత్వంలో కొనసాగుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు ఆటంకం కలిగించే ప్రయత్నం జరిగిందని పార్టీ నాయకత్వం ఆరోపించింది. శుక్రవారం మోత్కూరు నుంచి తిరుమలగిరికి పాదయాత్ర ప్రారంభమైన సందర్భంగా మల్లన్న ప్రయాణించే కారును లారీ ఢీకొట్టినట్లు వెల్లడించింది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయిందని, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పార్టీ ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపింది.

బీసీ ఉద్యమాన్ని అడ్డుకునే కుట్రనా?

బీసీలను చైతన్యపరుస్తూ రాజ్యాధికార సాధన కోసం ఉద్యమిస్తున్న తీన్మార్ మల్లన్నను లక్ష్యంగా చేసుకుని హత్యకు కుట్ర జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో బీసీ ఉద్యమకారులైన బెల్లి లలిత, మారోజు వీరన్న, సాంబశివుడు హత్యలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తాత్కాలికంగా పాదయాత్ర వాయిదా

ప్రమాద ఘటన నేపథ్యంలో మేధావుల సూచన మేరకు బీసీ రాజ్యాధికార పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. తదుపరి కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు