ఫుడ్ పాయిజన్ తో పలువురికి అస్వస్థత
12 మంది పెద్దలకు నలుగురు చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స
బిచ్కుంద, అక్టోబర్19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) జుక్కల్ నియోజకవర్గంలో గల పిట్లం మండలం అన్నారం తండాలో ఓ విందుకు హాజరైన వారిలో కొందరు ఫుడ్ పాయిజన్(Food Poisoning)కు గురయ్యారు. విందులో మాంసాహారం తినడం వల్ల వీరికి ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు తెలుస్తుంది.. నలుగురు చిన్నారులు, 12 మంది పెద్దలు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు.
వీరిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దసరా సందర్భంగా ఆదివారం నాడు మేకలు కోసుకొని మాంసాహారం తిన్నారని. మిగిలిన మాంసాహారం సోమవారం కొంతమంది తినడంతో వారు విరోచనాలు, వాంతులకు గురయ్యారని వైద్యులు రతన్ మన దినపత్రిక ప్రతినిధితో వెల్లడించారు.
నలుగురు చిన్నారులు, 12 మంది పెద్దలు అస్వస్థ గురై ఆస్పత్రిలో చేరినట్లు ఆయన వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు రతన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాన్స్వాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అస్వస్థతకు గురైన వారిని పరామర్శించి అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి ఆర్డీవో సూచించారు.