మందమర్రి ఏరియా వర్క్‌షాప్‌లో ఘనంగా ఆయుధ పూజ
19-10-2026 | 11:31pm
మందమర్రి, (విజయక్రాంతి): దసరా పండుగను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సెంట్రల్ వర్క్‌షాప్‌లో సోమవారం ఆయుధ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై యంత్రాలు, పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్మికులు విధి నిర్వహణలో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, యంత్రాలను జాగ్రత్తగా వినియోగించి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఇంజనీర్లు, కార్మిక సంఘాల నాయకులు, వర్క్‌షాప్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.