సంబరంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
వాడ వాడల పూలవనం
వెల్దుర్తి, అక్టోబర్18( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా జరుపుకునే బతుకమ్మ సంబరాల్లో(Bathukamma Celebrations) వెల్దుర్తి మండల పరిధిలోని నెల్లూరు, లింగాపూర్, రామయపల్లి, శెట్టిపల్లి, ఎలుకపల్లి, ఏదులపల్లి, మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం(Telangana State) లో ప్రత్యేకంగా తొమ్మిది రోజులు బతుకమ్మ వేడుక వేడుకలు జరుపు కోవటం ఆనవాయితీ అని, ఈ విధంగా మహిళలందరూ ఏకమై ఆట,పాటలతోటి బతుకమ్మలు జరుపుకుంటారని, అందరూ కలిసి సంతోషంగా పూజలు జరపటం, నిమజ్జనం చేస్తారని దీని ద్వారా అందరూ ఏకతాటిపై ఉంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
మహిళలతోపాటు కోలాటం, నృత్యం వంటి ఆటపాటలతో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల కోసం గ్రామాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ లను మహిళలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.