కంచర్లలో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు కరువు
భిక్కనూర్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో(Kancharla Village) బతుకమ్మ నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా బతుకమ్మ(Bathukamma) లను నిమజ్జనం చేసే చెరువు వద్ద విద్యుత్ లైట్లు లేకపోవడంతో సాయంత్రం టార్చ్లైట్ల వెలుతురులోనే నిమజ్జనం చేస్తున్నట్లు మహిళలు తెలిపారు.
సద్దుల బతుకమ్మ రోజు చీకటిలోనే కూర్చొని సద్ది తినాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.చెరువు వద్దకు వెళ్లేందు రహదారి పై గుంతలు ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని , అధికారులు, పాలకవర్గం తక్షణమే స్పందించి లైట్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.