ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును సన్మానించిన సొసైటీ పాలకవర్గం
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు తమపై ఎంతో నమ్మకంతో మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృషి చేసినటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తనపై నమ్మకంతో మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులుగా బాధ్యతలు అప్పజెప్పినందుకు ప్రాథమిక సహకార సంఘం అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కలాలి సురేందర్ గౌడ్,డైరెక్టర్లు కొమ్మగళ్ళ భీమయ్య,షేక్ ఆసిఫ్, పెద్దపట్లోళ్ల మహేశ్వర్ రెడ్డి, గంపల వెంకయ్య, విట్టల్రెడ్డిగారి శ్రీనివాస్ రెడ్డి, మూడేరు సాయిరాం,సిద్దిగారి సుజాత,రాజపేట యాదగిరి,జి.సాయికుమార్,సిహెచ్.భూపాల్ రెడ్డి, పరమల్ల దుర్గమ్మ,ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.