ఎమ్మెల్యేను కలిసిన మాసానిపల్లి సర్పంచి, మాజీ సర్పంచ్లు

10-10-2026 | 10:28pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 9 (విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లీ గ్రామానికి సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి(Peddapatlolla Sunanda Kishan Reddy) మరియు మాజీ సర్పంచులు వారికి విట్టల్,అంజగౌడ్లు(Vittal and Anja Goud) మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ గ్రామంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు.

మాసానిపల్లి గ్రామంలో(Masanipalli Village) నీటి సమస్య నిమిత్తం పైప్ లైన్ మంజూరు గురించి,రోడ్డు పనుల గురించి,నూతన మురికి కాల్వల నిర్మాణం, గురించి మరియు వివిధ అభివృద్ధి పనుల మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి,మాజీ సర్పంచ్లు వరిగే విట్టల్,కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరామిరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు