బాధిత కుటుంబాలకు పరామర్శ..

06-10-2026 | 09:58pm

తాడ్వాయి,అక్టోబర్,06( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామంలో మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ బాధితులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.

కార్యకర్తలకు, నాయకులకు పార్టీ చేదోడు వాదోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మహిళా సంఘం ప్రతినిదులతో మాట్లాడారు. మహిళల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, నాయకులు వెంకటరెడ్డి, శ్యాం రావు, సింగిల్ విండో చైర్మన్లు సుధాకర్ రావు, వెంకటరెడ్డి, జలంధర్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాస్కర్ రెడ్డి, రాజలింగం, లక్ష్మణ చారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు