బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులు

06-10-2026 | 11:34pm

కామారెడ్డి లో కలకలం 

కామారెడ్డి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బతికున్న మహిళలను కామారెడ్డిలో చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించి డెత్ సర్టిఫికెట్(Death Certificate) జారీ చేశారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం  రేపుతుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు  ఇలా ఉన్నాయి. కామారెడ్డి రాజీవ్ నగర్ కాలనీ చెందిన హసీనా బేగం బతికున్న చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు జారీ చేశారు. హసీనా బేగం పై రాజీవ్ నగర్ కాలనీలో వంద గజాల ఇంటి స్థలం ఉంది. హసీనా బేగంపై ఉన్న వంద గజాల ప్లాట్ ను సయ్యద్ అలీపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

హసీనా బేగం చనిపోకమందే ఆమె చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రం సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని హసీనా బేగం కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్యుమెంటల్ రైటర్ ను కలుపుకొని ఫేక్  రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ అధికారిని బాధితులు నిలదీశారు. రిజిస్ట్రేషన్ అధికారి డబ్బులు తీసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్ చేసిన అధికారు ల పై విచారణ జరపాలని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

మరిన్ని వార్తలు