కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు

05-11-2026 | 04:30pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 5 (విజయ క్రాంతి):మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో జైజైడబ్ల్యూఈఎస్ (ఎన్జిఓ)గ్రామీణ మహిళల ఆర్ధిక స్వాలంబన(Economic Self-Reliance of Rural Women), సాధికారత, కోసం ఈ స్వచ్ఛంద సేవా సంస్ధలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నీమహిళలకు టైలరింగ్ నైపుణ్యాలతో నేర్పి తద్వారా వారు ఇంటి నుంచే ఆదాయం సంపాదించుకునేలా ప్రోత్సహించడం,మహిళలు సొంతంగా తమ కాళ్లపై నిలబడేలా ఈ శిక్షణ కార్యక్రమం.

కామారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా మహిళా కోసం పనిచేసే ఈ జల్ జీవన్ అండ్ వుమెన్  ఎంపైర్మెంట్ సొసైటీ  (ఎన్జీవో)ధర్మారెడ్డి గ్రామంలో 16 మంది మహిళలు ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నవారికి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్.ప్రోగ్రామ్. కో ఆర్జినేటర్.అంజమ్మ, టైలరింగ్ శిక్షణకారులు సునీత.అంగన్వాడి సమన్వయకర్త వజ్రవ్వ,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు