విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లాలి

30-10-2026 | 05:19pm

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు..

తాడ్వాయి,అక్టోబర్, 30( విజయ క్రాంతి): విద్యార్థులు ఓ లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(Yellareddy MLA K. Madan Mohan Rao) తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో జరుగుతున్న ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడలలో(SGF Mandal-level Sports) ఆయన శుక్రవారం  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులకు సెకండరీ విద్య అనేది కీలకమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని పిలుపునిచ్చారు.గ్రామీణ స్థాయి క్రీడల నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయి క్రీడలలో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని కోరారు. మండల స్థాయిలో ఇంత బ్రహ్మాండంగా క్రీడలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజా గౌడ్, ఉప సర్పంచ్ స్వామి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారు సంజీవులు, ఎంపీడీవో భరత్ కుమార్ ఎంఈఓ రామస్వామి, పిఆర్టియు మండల అధ్యక్షులు రామచందర్ రెడ్డి  వ్యాక్యాత అకిటి నర్సారెడ్డి,నాయకులు పైడి రాజేశ్వర్ రెడ్డి శ్యామ్ రావు నరేందర్ సర్పంచులు పోచయ్య ప్రధానోపాధ్యాయులు చంద్రావతి సంగారెడ్డి కళ్యాణి పీఈటీలు నగేష్ సంఘ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు