ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

10-10-2026 | 09:53pm

- ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి

- ఢిల్లీలో నిర్బంధాలు ఆపాలి.. ప్రజాసంఘాలు, పార్టీల డిమాండ్‌

గజ్వేల్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌(CEC Gyanesh Kumar)ను పదవి నుంచి తొలగించాలని ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌ అంబేడ్కర్‌ భవన్‌(Gajwel Ambedkar Bhavan)లో చిప్పల యాదగిరి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లను తొలగిస్తున్నారని నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారి పేర్లను తొలగించడం దుర్మార్గమన్నారు.

తిరిగి ఓటు నమోదు కోసం అనేక పత్రాలు సమర్పించాలని ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం అన్యాయమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిపై ఢిల్లీలో నిర్బంధాలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీనివాస్‌, సర్దార్‌ ఖాన్‌, సందబోయిన ఎల్లయ్య, నవాజ్‌ మీరా, కొండనుల్ల నరేష్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు