అలుగునూర్ నుంచి అగ్గి రాజుకోనుందా?

28-11-2026 | 05:25am

కేసీఆర్ అరెస్ట్ అయిన చోటు నుండే సమర శంఖానికి బీఆర్‌ఎస్ ప్లాన్

కరీంనగర్, నవంబరు 27 (విజయక్రాంతి): నవంబర్ 29 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టానికి వేదికైన అలుగునూరులో ఈనెల 29న దీక్షా దివస్(Deeksha Divas)ను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అగ్గి రాజేసిందుకు బిఆర్‌ఎస్ సిద్ధం అవుతుంది. 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక సంచలన ఘట్టం.

కేసీఆర్ దీక్షకు బయలుదేరిన క్రమంలో అలుగునూరు ప్రాంతంలో ఆయనను అరెస్టు చేయడం తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదు. అందుకే బిఆర్‌ఎస్ ఈ ప్లేస్ ను ఎంచుకొని చావో రేవో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. దీక్షా దివస్ అనేది కేవలం బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన చారిత్రాత్మక దినమని  పేర్కొంటూ నేతలంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఉద్యమ పవిత్ర స్థలంగా భావిస్తున్న పార్టీ ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తుంది.

దీక్షా దివస్ సభకు కవులు, కళాకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీక్షా దివస్ సభకు బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండటంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే దీక్షా దివాస్ ప్రాంతం మీదుగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం రహదారి ఉంటుంది. వరంగల్ వైపు వెళ్లే వాహనాలను తీగల వంతెన మీదనుండి మళ్లించవచ్చు. అయితే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మళ్లించడం కష్టం అవుతుంది కనుక సభను కొద్దిదూరంలో ఉన్న సదశివపల్లి ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.

ఉమ్మడి జిల్లా నలువైపుల నుండే కాకుండా హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుండి కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి రానుండటంతో దీక్షా దివాన్ ప్రాంతం జనంతో  నిండి పోనుంది.  పోలీసులకి ట్రాఫిక్ క్రమబద్దీకరించడం కష్ట సాధ్యమే. అనుమతి ఇవ్వకుంటే కెటిఆర్ తండ్రి అరెస్టు అయిన చోటునే అరెస్టు అయ్యే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే 2009 ఉద్యమం తరహాలో బిఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే సభ వద్ద కానీ, రోడ్డుపై హాని ఎలాంటి కవ్వింపులకు పాల్వాడవద్దని పోలీయులకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఏది ఏమైనా 29 పైనే జరిగే బి ఆర్ ఎస్ దీక్షా దివాన్ పైనే అందరి దృష్టి ఉంది.

మరిన్ని వార్తలు