సిగ్గు లేకుండా రోడ్లపై ధర్నాలు చేస్తారా

08-09-2026 | 07:40pm

సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ముకరంపుర,(విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన అలాగే ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu) స్పీకర్ గడ్డం ప్రసాద్ పై  కుసంస్కార వ్యాఖ్యల పట్ల సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUD Chairman Komatireddy Narender Reddy) మండి పడ్డారు. కోర్టు చౌరస్తా వద్దగల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ(Congress Party) నేతలతో కలిసి పూల మాల వేసి అక్కడే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.... అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన కేసీఆర్ అసెంబ్లీ ముందు గూండాయిజం చేయమని, సంస్కార హీనంగా మాట్లాడమని చెప్పారా అని ప్రశ్నించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తిరిగి సిగ్గు లేకుండా రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు ఆందోళనలకు చేయటం ఏంటని అన్నారు.అసెంబ్లీ సాక్షిగా వారు ప్రవర్తించిన తీరుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యులను శాశ్వతంగా పదవి నుంచి తొలగించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పర్వతం మల్లేశం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు