ఆర్టీసీ కార్మికుల అరెస్టు అవివేకం
08-09-2026 | 07:49pm
హుజురాబాద్,(విజయ క్రాంతి): ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల(retired RTC workers) అరెస్టులు అవివేకమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రిటైర్మెంట్ ఉద్యోగుల జేఏసీ(State Retirement Employees JAC) పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి హుజురాబాద్ డిపోకు చెందిన జేఏసీ నాయకులు తరలివెళ్లారు. 2017, 2021 తదితర సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ ఎదుట ధర్నా చేపట్టగా పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులను కూడా అరెస్ట్ చేయడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.