క్షేత్రస్థాయిలో భద్రత ఎంత?

29-10-2026 | 05:25am
  1. అగ్నిప్రమాదం జరిగితే అంతే సంగతి!
  2. నిబంధనలు పాటించని -కమర్షియల్ కాంప్లెక్సులు, స్కూళ్లు, ఆసుపత్రులు
  3. కరీంనగర్‌లో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువు!

కరీంనగర్ క్రైం, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) నగరం విస్తరిస్తోంది. కార్పొరేషన్ పరిధి పెరిగింది. బహుళ వాణిజ్య సంస్థలు క్యూ కడుతున్నాయి. ఎత్తున భవనాలు పెరుగుతున్నాయి. వ్యా పార సముదాయాలు విస్తరిస్తున్నాయి. కానీ ప్రజ ల ప్రాణాలకు రక్షణగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయనేది రహస్యమే.

అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు అవసరమైన మార్గాలు, పనిచేసే అగ్నిమా పక పరికరాలు, నీటి సరఫరా వ్యవస్థలు నిజంగా అందుబాటులో ఉన్నాయా లేక అనుమతులు, తనిఖీల పేరుతో కాగితాలకే పరిమితమవు తున్నాయా అనేది అంతుచిక్కని ప్రశ్నలా ఉంది. కొద్ది రోజుల క్రితం ఫైర్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ నిబంధనల అతి క్రమణలు విస్తుగొలిపే విధంగా ఉన్నాయి.

నిబంధనలు ఉన్నా.. అమలు ఎక్కడ?

అగ్నిప్రమాదం సంభవించినప్పుడు  ప్రాణాలను కాపాడే కొన్ని నిమిషాలే కీలక సమయంగా మారుతాయి. అలాంటి సమయంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేయకపోయినా, ఫైర్ అలారం మోగ కపోయినా, అత్యవసర మార్గాలు మూసుకుపోయినా పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుం దో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ కాంప్లెక్సుల్లో దుకాణాలు, గోదాములు, విద్యుత్ పరికరాలు ఒకేచోట దాదాపు ఒకేచోట ఉంటున్నాయి. షాపింగ్ మాల్స్‌లో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో చిన్నారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉంటారు.

ఆసుపత్రుల్లో నడవలేని రోగులు, వృద్ధులు, అత్యవసర చికిత్స పొందుతున్నవారిని తరలించడం మరింత కష్టం. ఇలాంటి భవనాల్లో అగ్నిమాపక పరికరాలు పనిచేస్తున్నాయా, సిబ్బందికి శిక్షణ ఉందా, అత్యవసర నిష్క్రమణ మా ర్గాలు అందుబాటులో ఉన్నాయా, క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారా అన్నది కీల కం. అయితే అన్ని అనుమతులు ఉంటేనే ఇవ్వాల్సిన ఫైర్ ఎన్‌ఓసిలు అంగట్లో సరుకులా ఎలా సమకూరుతున్నాయనేది విచారణలో బయటపడే అవకాశం ఉంది.

తనిఖీలు తూతూమంత్రమేనా?

ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న భవనాలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయమే. తనిఖీలు జరిగాయని చెప్పడం ఒక ఎత్తయితే, గుర్తించిన లోపాలు సరిచేయించడమే అసలు బాధ్యత. నోటీసుల జారీ, హెచ్చరికలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పు జరు గుతుందా అనేది రహస్యంగానే ఉండిపోతుంది. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కంటే, ప్రమాదానికి దారితీసే లోపాలను ముందుగానే గుర్తించడం ఫైర్ శాఖ ప్రధాన బాధ్యత కాదా అంటూ ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులు చేసే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదు.

భవనాల వినియోగం, అంతస్తులు, ఆక్యుపెన్సీ, సంబంధిత ఫైర్ సేఫ్టీ నిబంధనల ఆధారంగా అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్నది అధికారులు నిర్ధారించాలి. భవనానికి ఫైర్ సేఫ్టీ అనుమతి ఉన్నంత మాత్రాన అన్ని ఏర్పాట్లు ఎప్పటికీ సక్రమంగా ఉన్నాయని భావించలేం. ఏదైనా భారీ అగ్నిప్రమాదం జరిగితే నష్టపోయేది సామాన్య ప్రజలే. ప్రాణాలు కోల్పోయిన తర్వాత విచారణలు, సమీక్షలు, పరామర్శలు నిర్వహించడం తప్ప సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు అయి తే చరిత్రలో లేవనే అనుకోవచ్చు.

మరిన్ని వార్తలు