కాలుష్యం నుంచి విముక్తి కల్పించండి

29-10-2026 | 05:00am
  1. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించండి
  2. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్
  3. రెండో రోజు కొనసాగిన జన సంకల్ప యాత్ర
  4. అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ మీదుగా కీసర వరకు..

ఘట్‌కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తక్షణమే తరలించి, పరిసర ప్రాంతాల ప్రజలకు కాలుష్య సమస్య నుంచి విముక్తి కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ చేపట్టిన జన సంకల్ప యాత్ర రెండో రోజు బుధవారం అన్నోజిగూడ నుంచి ప్రారంభమైంది.

అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ మీదుగా కీసరకు చేరుకుంది. ఘట్‌కేసర్‌లో పాదయాత్ర నిర్వహించిన ఎంపీ ఈ టల రాజేందర్‌కు ప్రజల నుంచి ఘన స్వా గతం లభించింది. ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు సమస్యపై ప్రభుత్వం స్పందించి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు కారణంగా పరిస ర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.   

పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి: ఓయూ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి 

‘మనం పీల్చే గాలి స్వచ్చంగా ఉండాలి అది మన హక్కు. ఇక్కడ గాలి విషం అ య్యింది. జవహర్ నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశాం. జస్టిస్ స్వతంత్ర కుమార్ జవహర్ నగర్ డంప్ యార్డు ఎత్తివేయాలని ఆర్డర్ ఇచ్చారు. దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని పర్యావరణ వేత్త, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. 

యాత్ర లో  బీజేపీ సీనియర్ నేత బొడిగ శోభ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చై ర్మన్ కుందారం గణేష్ చారి, బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఘట్కేసర్  అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు