విద్యార్థులకు చిత్రలేఖన పోటీలకు ఆహ్వానం

01-10-2026 | 07:24pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పాఠశాల విద్యార్థుల(Students ) కోసం జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆర్ట్, ఫిజికల్, వర్క్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (టీ హేపిడబ్ల్యూఈటీఏ) జిల్లా అధ్యక్షుడు తాడూరి లక్ష్మీనారాయణ తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

విద్యార్థులు సద్దుల బతుకమ్మ విశిష్టత(Bathukamma Drawing Competition) (నాడు -నేడు ) అంశంపై ఆ ఫోర్  సైజు పేపర్‌పై చిత్రాన్ని గీసీ, చిత్రం వెనుక భాగంలో లేదా కింది భాగంలో విద్యార్థి పేరు, తరగతి, చిరునామా, సెల్ నంబర్‌తో పాటు ఫొటోను జతచేసి రూ.20 ప్రవేశ రుసుముతో పోస్టు, కొరియర్ లేదా నేరుగా అసోసియేషన్ కార్యాలయానికి అందజేయాలని తెలిపారు.పోటీలో ఉత్తమ చిత్రాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సూ లేషన్, బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

అలాగే పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రం అందజేస్తారు. గీసిన చిత్రాలను అక్టోబర్ 13 తేదీ లోపు తెలంగాణ ఆర్ట్, ఫిజికల్, వర్క్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కార్యాలయం, ఇంటి నంబర్ 2-7-146, బస్టాండ్ పక్కన, కళాశాల భారతి ఎదురుగల్లీ, కరీంనగర్ చిరునామాకు పంపాలని నిర్వాహకులు కోరారు. పూర్తి వివరాలకు 98493 02904 / 7989074093 నంబర్‌ను సంప్రదించలని తెలియజేశారు.

మరిన్ని వార్తలు