అమెరికా న్యూయార్క్ అటార్నీ జనరల్ బరిలో కోమటిరెడ్డి సరిత రెడ్డి

04-11-2026 | 11:50am

కరీంనగర్,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముంపు గ్రామమైన చెగ్యాంకు చెందిన కోమటిరెడ్డి సరితారెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సుమారు 45 ఏళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. వైద్యులైన కోమటిరెడ్డి హనుమంతరెడ్డి, గీతారెడ్డి దంపతుల కుమార్తె అయిన కోమటిరెడ్డి సరితారెడ్డి బ్రూక్లిన్‌లో పుట్టి పెరిగి న్యాయవాదిగా స్థిరపడ్డారు. ఆమె ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో పోటీ చేయడంతో స్వగ్రామం లోని బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి సరితా రెడ్డి మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సమీప బంధువు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు