తుంగతుర్తి దళిత బంధు... ద్రోహి... కిషోర్
తుంగతుర్తి అభివృద్ధి కోసం అసెంబ్లీలో పోరాటం చేస్తున్న ప్రజా నాయకుడు... ఎమ్మెల్యే సామెల్.
ముఖ్యమంత్రి, దళిత ఎమ్మెల్యే పై, కిషోర్ అనుచిత వాక్యాలు తగదు... ఖబర్దార్.
మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల. వెంకన్న మాదిగ
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి దళిత బందు అవినీతి ద్రోహి మాజీ ఎమ్మెల్యే కిషోర్(Former MLA Kishore) నేనని, ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి(CM Revanth reddy) అనుకున్న మరు క్షణంలోనే ఆయనను కలిసి, నిధులు, సమస్యల పరిష్కరించుకునే దమ్మున్న నాయకుడు తుంగతుర్తి దళిత ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అని మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అనుక్షణం, ఇద్దరు వ్యక్తుల కలయికను జీర్ణించుకోలేని నీవు, వాడు, ఈడను మాట్లాడడం ఏం మాత్రం మంచిది కాదు, దళితులు గతంలోనే నీకు తగిన బుద్ధి చెప్పినారు.
ఈసారి నీకు దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో నైనా పది సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు, ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేని నీవు, 2000 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తు, నూతనకల్, మద్దిరాల మండలాల్లో 70 సంవత్సరాలుగా ఏ ప్రజా ప్రతినిధి చేయనటువంటి పనిని ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రులతో కలిసి, భూస్వాముల భూమిని, పేద రైతులకు వెయ్యి మందికి పట్టాలిప్పించిన ఘనత ఎమ్మెల్యే మందుల సామెల్ కి దక్కింది దక్కింది. స్థానిక ఎమ్మెల్యే పై విమర్శించడం నీకు తగదని అన్నారు.
ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు హైడ్రా ఏర్పాటు. రైతు రుణమాఫీ. రైతుబంధు .ఫ్రీ బస్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ . మహిళలకు బ్యాంకురుణాలు. గ్లోబల్ సమ్మిట్ .ఎస్సీ వర్గీకరణ. 70 వేల పైచిలుకు ఉద్యోగాలు . సన్న బియ్యం. పెన్షన్స్. ఇందిరమ్మ ఇండ్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలను, రాజకీయాలకతీతంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే అని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే, మళ్లీ దళిత ప్రజలు నీకు బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు.