జీవిత బీమా- కుటుంబానికి దీమ

12-11-2026 | 05:50pm

ముకరంపుర, నవంబర్ 12(విజయ క్రాంతి): కుటుంబానికి కష్టకాలంలో ఆర్థిక భరోసా(Financial Security) ఇచ్చేది జీవిత బీమా అని మరోసారి రోజువైంది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్(Tata AIA Life Insurance) కరీంనగర్ బ్రాంచ్ నుండి గజ్వేల్ వాస్తవ్యుడు మాగపు సత్యనారాయణ తన సతీమణి మాగపు వెంకటలక్ష్మి పేరు మీద జీవిత బీమా చేయించడంతో.

దురదృష్టవశాత్తు వెంకటలక్ష్మి ఆగస్టు 30న మరణించడంతో నామినిగా ఉన్న సత్యనారాయణ డెత్ క్లైమ్ రూ.14,80,055/- మొత్తాన్ని చెక్కు రూపంలో  అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఆదర్శ కుమార్ మాట్లాడుతూ జీవిత బీమా అనేది కేవలం పాలసీ మాత్రమే కాదని కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచే ఆర్థిక రక్షణ కవచం అని తెలియజేశారు.

డెత్ క్లైమ్ కు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే సెటిల్మెంట్ చేయడం మా టాటా ఏఐఏ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు నవీన్ కుమార్, మహేందర్, పార్టనర్ గుడెల్లి రాజు, దూలం రమేష్ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు