మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

12-11-2026 | 05:42pm

బాధిత కుటుంబానికి అండగా సర్పంచ్ వెంకన్న

చివ్వెంల, నవంబర్ 12 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) జయరాంగుడి తండా గ్రామపంచాయతీ (Jayarangudi Thanda Gram Panchayat) పరిధిలోని హలావత్ తండాకు చెందిన దారావత్ లింగా అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబానికి గ్రామపంచాయతీ తరఫున ఆర్థిక సాయం అందించారు.

గురువారం సర్పంచ్ వెంకన్న ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి గ్రామపంచాయతీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు