డాక్టర్ రేకులపల్లి విజయకు మాతృసవనం పురస్కారం
సుల్తానాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి(Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamy) 70వ తిరునక్షత్ర మహోత్సవాల (యతీంద్ర సప్తతి) సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతిభావంతులకు (మాతృమూర్తులకు) ఈ ప్రత్యేక గౌరవాన్ని అందించారు.
హైదరాబాదులో ముచ్చింతలోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాతృ సవనం అవార్డుతో సుల్తానాబాద్ శ్రీవాణి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లయన్ రేకులపల్లి విజయ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక , డైరెక్టర్ రేకులపల్లి సుష్మ ప్రిన్సిపల్స్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్ అధ్యాపక బృందం విజయ కు అవార్డు రావడం మన ప్రాంతానికి శ్రీవాణి విద్యాసంస్థలకు దక్కిన గౌరవం అని తెలిపారు....