వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి

12-11-2026 | 05:14pm

ఎంపీడీఓ చిన్న రెడ్డి 

చేగుంట నవంబర్ 12: ఎల్-నినో ప్రభావంతో(El Niño effect) రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చేగుంట ఎంపీడీవో చిన్న రెడ్డి(Chegunta MPDO Chinna Reddy) అధికారులకు, గ్రామ సర్పంచ్‌లకు సూచించారు. ఇందులో భాగంగా గురువారం చేగుంట మండలం లోని కర్నాల పల్లి గ్రామం లొ సర్పంచ్ దుర్గ దేవి అధ్యక్షతన ఎల్-నినో స్పెషల్ డ్రైవ్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వేసవిలో గ్రామం లొ నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నీటి వనరుల సంరక్షణ, పైప్‌లైన్ లీకేజీల నివారణ, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల (ఓహెచ్‌ఎస్‌ఆర్‌) మరమ్మతులు, క్లోరినేషన్, తాగునీటి నాణ్యత పరీక్షలపై చర్చించారు.  గ్రామంలోని అన్ని ఆవాస ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని  పంచాయతీ కార్యదర్శులకు వివరించారు.

అదేవిధంగా జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో  ఎంపీడీఓ చిన్న రెడ్డి ఏపీఓ శ్వేతా, ఎంపీవో ప్రకాష్, వ్యవసాయ అధికారి హరి ప్రసాద్, హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్, కార్యదర్శి పుష్పలత, ఉప సర్పంచ్ శివకుమార్, వార్డ్ సభ్యులు,వీబీజీ రామ్‌జీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు