మోతె మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

12-11-2026 | 05:47pm

ఎనిమిది గ్రామాల్లో పరామర్శలు.. అనారోగ్య బాధితులకు పలకరింపు

మోతె, నవంబర్ 12 (విజయ క్రాంతి): కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి(Kodad MLA Nalamada Padmavathi Reddy) శుక్రవారం మోతె మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలపనున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొర్ర రాములు నాయక్‌తో పాటు మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న సర్వారం మాజీ సర్పంచ్ మిక్కిలినేని ఇందిరను కలసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.

ఉదయం 11 గంటలకు బోడబండ్ల గూడెంలో కాంపెల్లి వెంకటనారాయణ కుటుంబ సభ్యులను, 11.30 గంటలకు రాంపురం తండాలో కొర్ర రాములు నాయక్‌ను, మధ్యాహ్నం 12 గంటలకు రాయి కుంట తండాలో భుక్య బిచ్చ కుటుంబ సభ్యులను, 12.30 గంటలకు రాందాస్ తండాలో భూక్య దస్రు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

మధ్యాహ్నం 1 గంటకు సర్వారంలో మేడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని, 1.15 గంటలకు మిక్కిలినేని ఇందిరను కలుస్తారు. 1.40 గంటలకు బుర్కచర్లలో బొమ్మగాని భాగ్యమ్మ కుటుంబాన్ని, 2 గంటలకు అప్పన్నగూడెంలో సోమగాని సుక్కమ్మ కుటుంబాన్ని, 2.30 గంటలకు రావిపహాడ్‌లో వీరమల్ల బిక్షం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొనాలని మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు