మానవత్వం చాటిన పోలీసులు!
నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దంగా ట్రాఫిక్ సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సంపత్‌లకు ఎస్ఐ రవి అభినందనలు
హుజురాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): విధి నిర్వహణలో నిజాయితీకి, మానవత్వానికి పోలీసులు(Police) మారుపేరుగా నిలవాలని చెప్పే ఘటన హుజురాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. రోడ్డుపై దొరికిన పర్స్‌ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్‌కు(Police Station) తీసుకెళ్లి, అందులోని నగదు, వ్యక్తిగత కార్డులతో సహా యజమానికి సురక్షితంగా అందజేసి ట్రాఫిక్ పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు.
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎం.డి. అంకుశావలి తన పర్స్‌ను పోగొట్టుకున్నారు. అదే సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుళ్లు హెచ్‌జీ శ్రీనివాస్, హెచ్‌జీ సంపత్‌లకు ఆ పర్స్ లభించింది. వెంటనే వారు బాధ్యతాయుతంగా స్పందించి పర్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్ఐ రవి ఆధ్వర్యంలో పర్స్‌లోని వ్యక్తిగత కార్డులు, నగదును పరిశీలించి యజమాని ఎం.డి. అంకుశావలికి తిరిగి అప్పగించారు.
ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సంపత్‌ల నిజాయితీ, నిబద్ధత, మానవతా దృక్పథాన్ని ఎస్ఐ రవి అభినందించారు. ప్రజల రక్షణతో పాటు ప్రజల ఆస్తులకు భరోసా కల్పించడంలోనూ పోలీసులు ముందుంటారనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. విధి నిర్వహణలో ఇలాంటి ఆదర్శప్రాయమైన ప్రవర్తన పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడమే కాకుండా ప్రజల్లో పోలీసుల పట్ల మరింత నమ్మకాన్ని పెంపొందిస్తుందని పలువురు ప్రశంసించారు.