ఘనంగా యాదగిరి సునీల్ రావు జన్మదిన వేడుకలు
హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు
ముకరంపుర, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భగత్ నగర్ లోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ దేవాలయ ఆవరణలో పవిత్రమైన జమ్మి, రామసీత ఫలం మరియు ఏక బిల్వం మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ ఆలయ అర్చకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం భగత్ నగర్ లోని మరకత భవానీ శంకర దేవాలయంలో బిజెపి నాయకులు దాసరి రాజ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సునీల్ రావు జన్మదినం సందర్భంగా నవగ్రహ పూజ మరియు మృత్యుంజయ హోమం నిర్వహించారు.