పంచాయతీ భవనం మంజూరు

07-11-2026 | 09:51am

అజ్మీర్ హీరామాన్ తండాకు పంచాయతీ భవనం మంజూరు..

మూడు కుంటల ఎన్ఎస్పీ భూమిని అధికారులకు అప్పగించిన రెవెన్యూ అధికారులు

కూసుమంచి, (విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం అజ్మీర్ హీరామాన్ తండాకు(Ajmeer Heeraman Tanda) పంచాయతీ భవనం మంజూరైంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీకి స్వంత భవనం లేకపోవడంతో  స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు  రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) వినతి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి నూతన పంచాయతీ భవనాన్ని మంజూరు చేశారు. ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేయాలని మంత్రి మండల రెవెన్యూ అధికారి సైదులు ను ఆదేశించారు. దీంతో గ్రామంలో ప్రభుత్వ భూమిని సర్వే చేసి మూడు కుంటల భూమి ఎన్ఎస్పీ భూమిని ఐటీడీఏ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా అజ్మీర్ హీరామాన్ తండా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న మంత్రికి జన్మాంత రుణపడి ఉంటామని అన్నారు.

మరిన్ని వార్తలు