కంపు కొడుతున్న కాలనీ
డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు... అధ్వానంగా రహదారులు
పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం... కాలనీవాసుల ఆవేదన
బాన్సువాడ, నవంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) పట్టణంలోని 15వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో డ్రైనేజీలను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో మురుగు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు. మరోవైపు రహదారులపై శుభ్రత పనులు చేపట్టకపోవడంతో కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని పేర్కొంటున్నారు. డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోవడం, రోడ్లపై పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు(official negligence), పారిశుద్ధ్య సిబ్బంది పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి 15వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని, డ్రైనేజీలను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని కాలనీవాసులు కోరుతున్నారు.