బేతుపల్లి చెరువు కథ సుఖాంతం.. అందరూ సేఫ్
బేతుపల్లి చెరువు ఘటనకు శుభం కార్డు.. 16 మంది సేఫ్
సత్తుపల్లి, నవంబర్ 5 (విజయక్రాంతి): బేతుపల్లి చెరువులో చోటుచేసుకున్న ప్రమాదకర ఘటన చివరకు సుఖాంతమైంది. చిమ్మచీకటిలో సాగిన Rescue Operation విజయవంతం కావడంతో మొత్తం 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం చెరువును సందర్శించి సహాయక చర్యల్లో పాల్గొన్న NDRF, SDRF, Fire సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
నిన్న సాయంత్రం బేతుపల్లి చెరువులో ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకుపోగా, వారిని రక్షించేందుకు వెళ్లిన SDRF బృందం పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన NDRF, SDRF, Fire సిబ్బంది సమన్వయంతో Rescue Operation చేపట్టి అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రి వేళ చిమ్మచీకటిలోనూ ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది సేవలు అభినందనీయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఈ ఘటనను నిన్న సాయంత్రం నుంచి నిరంతరం పర్యవేక్షించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయక బృందాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి 16 మంది ప్రాణాలను కాపాడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.