చిక్కుల్లో సల్మాన్

05-11-2026 | 08:19am

దేశభక్తి సినిమాలో ఐటమ్ సాంగ్ ఏంటి భాయ్.. సల్మాన్‌పై ట్రోల్స్!

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ నుంచి విడుదలైన ‘టెరి సెక్సీ బ్యూటీ’ పాటపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కుతున్న దేశభక్తి చిత్రంలో ఇలాంటి Romantic Song అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నవంబర్ 4న విడుదలైన ఈ పాటలో సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్రాంగద సింగ్ కనిపించారు. రెడ్ కలర్ శారీలో చిత్రాంగద అందాలు, సల్మాన్‌తో రొమాంటిక్ సన్నివేశాలు, డ్యాన్స్‌తో పాటను తెరకెక్కించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత సల్మాన్ మళ్లీ Playback Singing చేయడం కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే పాటలోని Lyrics, Picturisation మాత్రం ప్రేక్షకుల్లో ఒక వర్గానికి నచ్చలేదు. ముఖ్యంగా గల్వాన్‌లో ప్రాణత్యాగం చేసిన సైనికుల నేపథ్యంతో రూపొందుతున్న సినిమాలో ఈ తరహా పాటను ఎలా చేర్చారంటూ X వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొంతమంది నెటిజన్లు పాటను దేశభక్తి చిత్రానికి ఏమాత్రం సరిపోని అంశంగా అభివర్ణించగా, మరికొందరు సల్మాన్ గానంపై కూడా సెటైర్లు వేస్తున్నారు. పాటలోని Lyrics‌ను ‘ChatGPT Lyrics’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. సల్మాన్ తన పాత ఇమేజ్‌ను తానే దెబ్బతీసుకుంటున్నారని, సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఆయన అభిమానులు మాత్రం పాట ట్యూన్ బాగుందని, సల్మాన్ తిరిగి పాడటం ఆనందంగా ఉందని Support చేస్తున్నారు. గతంలో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ పేరుతో తెరకెక్కుతోంది. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ ఘటనలో కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సినిమాలో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో, చిత్రాంగద ఆయన భార్య పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు