నేడు క్యాబినెట్ భేటీ
- సంక్షేమ పథకాలు, ఎల్ నినో పరిస్థితులపై చర్చ
- కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఆమోదంపై దృష్టి
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ర్టంలో పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మంత్రివర్గం సమావేశం(Cabinet Meeting) కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీకి ముందు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కా నున్నారు. అనంతరం జరిగే క్యాబినెట్ భేటీలో సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులు(El Niño conditions), మున్ముందు దాని ప్రభావం , కొత్త ప్రాజెక్టుల(New project) ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి.
వీటితో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖా ళీగా ఉన్న పోస్టులు, ఉద్యోగ నియామకాలు, బడ్జెట్ నిధుల కేటాయింపులపైనా మంత్రివర్గం దృష్టి సారించనుంది. పారిశ్రామిక రంగానికి కొత్త పెట్టుబడులను తీసుకురావడం, ప్రతిపాదిత పరిశ్రమలకు భూములు కేటాయించే అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ర్టంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి, ఆయా శాఖల పనితీరుపై మంత్రులకు సీఎం సూచనలు చేయనున్నారు.
సమావేశం అనంతరం క్యా బినెట్ ఆమోదించిన నిర్ణయాలను ప్రభు త్వం మీడియాకు వెల్లడించనుంది. మంత్రి వర్గ సమావేశం నేపథ్యంలో ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. క్యాబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదనలు, అజెం డా అంశాలు, బిల్లులపై సమీక్షించారు.