రామాయణం పబ్లిక్ టాక్

05-11-2026 | 08:50am

భారతీయ ఇతిహాసం రామాయణాన్ని వెండితెరపై సరికొత్త ప్రపంచంగా ఆవిష్కరిస్తూ రూపొందిన భారీ చిత్రం ‘రామాయణం: పార్ట్ 1’ (Ramayana Movie Twitter Review)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ Mythological Epic నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన World Premiere అనంతరం అంతర్జాతీయ సినీ విమర్శకుల నుంచి వచ్చిన తొలి స్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా Grand Visuals, భారీ Production Design, VFX, నటీనటుల Performance‌కు పలువురు ప్రశంసలు అందించారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ Screen Presence, రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో చూపించిన నటన, సాయిపల్లవి అభినయంపై మంచి స్పందన వ్యక్తమైంది. అయితే కథనం కొన్ని చోట్ల నెమ్మదించడం, ఎక్కువ నిడివి, సంగీతం విషయంలో మాత్రం కొందరు విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సినిమాకు తొలి అంతర్జాతీయ స్పందన పూర్తిగా ఏకపక్షంగా కాకుండా Mixed Reviews రూపంలో కనిపిస్తోంది.

నమిత్ మల్హోత్రా నిర్మాణంలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి దూబే, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ గాథకు ప్రపంచ స్థాయి Cinematic Experience జోడించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలి భాగంపై ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, ముఖ్యంగా యశ్ రావణుడి పాత్రకు లభిస్తున్న ఆదరణ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు