ఓడినా తగ్గేదే లే.. మళ్లీ యుద్ధం చేస్తా
ఇరాన్ యుద్ధం వల్లే ఎన్నికల్లో దెబ్బ
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్ ధరలు.. రిపబ్లికన్ల ఓటమి.. ట్రంప్ ఏమన్నారంటే?
వాషింగ్టన్, నవంబర్ 5: ఇరాన్‌తో యుద్ధం అమెరికా రాజకీయాలపై ప్రభావం చూపిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) అంగీకరించారు. పెట్రోల్ ధరలు పెరగడం రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. అయితే, ఇదే పరిస్థితి మళ్లీ ఎదురైనా ఇరాన్‌పై సైనిక చర్యకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో కొత్త Ballroom నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఎదురుదెబ్బకు యుద్ధం కూడా ఒక కారణమన్న అభిప్రాయంతో ఏకీభవించారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసే అవకాశం ఇవ్వకూడదని, దేశ భద్రత కోసమే Military Operation చేపట్టామని సమర్థించుకున్నారు.
యుద్ధం మళ్లీ చేస్తా!
యుద్ధం వల్ల రాజకీయంగా నష్టం జరిగినా నిర్ణయంపై పశ్చాత్తాపం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే మరోసారి అదే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. చమురు ధరలు ఊహించిన స్థాయిలో పెరగలేదని పేర్కొంటూ, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా దెబ్బతీసిందని తెలిపారు. ఇరాన్‌కు చెందిన Navy, Air Force, Air Defence వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. Strait of Hormuz మీదుగా చమురు రవాణా కూడా యుద్ధానికి ముందుకంటే పెరిగిందని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించలేదు.
వాన్స్ వ్యాఖ్యలపై ఏమన్నారంటే?
ఎన్నికల ఫలితాలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించగా ట్రంప్ స్పందించారు. యుద్ధం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ముందే ఊహించానని తెలిపారు. వాన్స్ అభిప్రాయాలను కూడా తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఇక ఇరాన్‌తో పోరు ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు.. సరైన ఫలితం సాధించినప్పుడే యుద్ధం ముగుస్తుందని సంకేతాలిచ్చారు. అణ్వాయుధాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.