గూగుల్ భారీ ఆఫర్
గూగుల్‌లో ఉద్యోగులకు షాక్.. స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ ఆఫర్!
టెక్ దిగ్గజం Googleలో కీలక పరిణామం చోటుచేసుకుంది. Artificial Intelligence (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు Voluntary Exit Offer ప్రకటించింది. ఇందులో భాగంగా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని ఎంపిక చేసిన ఉద్యోగులకు Severance Package తీసుకుని సంస్థ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగే అవకాశం కల్పించింది.
Reuters నివేదిక ప్రకారం.. గూగుల్ 2025లోనే కొన్ని విభాగాల్లో ఈ Voluntary Exit Program ప్రారంభించింది. 2026 జూన్‌లో మరో ఐదు దేశాలకు విస్తరించింది. అయితే ఈ ఆఫర్‌ను ఎంతమంది ఉద్యోగులు అంగీకరించారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. AI Research విభాగమైన Google DeepMind, Google Cloud వంటి కీలక విభాగాలకు గతంలో ఇలాంటి ఆఫర్ల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. AI, Cloud Computing రంగాల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విభాగాల్లో నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఏడాది జీతం వరకు సెవరెన్స్ ప్యాకేజీ!
స్విట్జర్లాండ్‌లో ఈ ఆఫర్‌ను స్వీకరించిన ఉద్యోగులకు పనిచేసిన ప్రతి సంవత్సరానికి ఒక నెల జీతం చొప్పున చెల్లించేలా ప్యాకేజీ రూపొందించారు. గరిష్ఠంగా 12 నెలల జీతం పొందే అవకాశం కల్పించారు. అక్కడ గూగుల్‌కు సుమారు 5,000 మంది ఉద్యోగులు ఉండగా, 50 మంది సభ్యులున్న ఒక టీమ్‌లో కనీసం నలుగురు ఈ ఆఫర్‌కు అంగీకరించినట్లు Reuters వెల్లడించింది. ఒకవైపు AI రంగంలో భారీ విస్తరణ.. మరోవైపు Workforce Restructuring ద్వారా ఖర్చుల నియంత్రణ.. ఈ రెండు వ్యూహాలతో Alphabet ముందుకు సాగుతోంది.