భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి భారతీయుడి బాధ్యత
అంబేద్కర్ ఆశయాలకు మోదీ ప్రభుత్వం సముచిత గౌరవం – నెల్లూరి కోటేశ్వరరావు
ఖమ్మం, నవంబర్ 26 విజయక్రాంతి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day of India) పురస్కరించుకొని ఖమ్మం జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జడ్పీ సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రతులను చేతబూని రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన సేవలు, దేశానికి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనే విలువలతో దేశంలోని కోట్లాది ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ సేవలకు సముచిత గుర్తింపు కల్పిస్తూ, ఆయన జీవితంతో ముడిపడిన ఐదు ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఆయన ఆశయాలను భావితరాలకు చేరువ చేస్తోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బోయల వెంకట్, కార్యవర్గ సభ్యులు కోటమర్తి సుదర్శన్, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు శ్యాంసుందర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల నాగేందర్, సీనియర్ నాయకులు సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్, వీరల్లి రాజేష్, కోశాధికారి వెంకట గుప్తా పాల్గొన్నారు