కూసుమంచి శివాలయం హుండీ ఆదాయం?

26-11-2026 | 06:30pm

కూసుమంచి, నవంబర్ 26(విజయక్రాంతి): కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి(శివాలయం)(Sri Ramalingeswara Swamy) దేవాలయం ఆవరణంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ ఆదాయం రూ.1,52,648 లభించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో వేడుకలు నిర్వహించగా కొద్ది రోజులకు హుండీ ఆదాయం లెక్కించినట్లు ఆలయ ఈఓ శ్రీకాంత్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ పర్యవేక్షణాధికారి  వేణుగోపాల చార్యులు, కూసుమంచి భక్తులు కొండా మైపాల్, గుండా ఉపేందర్ రెడ్డి, అర్వపల్లి వెంకటేశ్వర్లు, కూసుమంచి శ్రీ సత్య సాయి సేవా సమితి అధ్యక్షులు చోడవరపు రమేష్, అర్చకులు దేవులపల్లి శేషగిరి శర్మ, అభి రామ్ శర్మ, ఆంజనేయ స్వామి అర్చకులు రంగ బాలాజీ, జూనియర్ అసిస్టెంట్ పి. రాందాసు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు