బండి కృష్ణారెడ్డి మృతికి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ నివాళి
06-10-2026 | 11:21pm
సత్తుపల్లి (విజయక్రాంతి): సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బండి కృష్ణారెడ్డి సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Matta Dayanand Vijay Kumar) నారాయణపురం గ్రామానికి వెళ్లి బండి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.