వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ సభ్యులు కట్టా
సత్తుపల్లి నవంబర్ 22 (విజయక్రాంతి): మండల పరిధి కిష్టారం గ్రామానికి చెందిన ముదిగొండ్ల ప్రసన్నకుమార్ సాయి హిమ వర్ష వివాహ వేడుకలకు కల్లూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు కట్టా అజయ్ కుమార్(Katta Ajay Kumar) ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అందులో బాగంగా మండల పరిధి పుల్లయ్య బంజరు గ్రామానికి చెందిన వికృతి శివ రామ కృష్ణ,వికృతి శివ లీల కృష్ణల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైనరు.
అంతే కాకుండా మండల పరిధి కొత్త యర్రబోయినపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ పోట్రు పుష్పావతి వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిధి లింగాల గ్రామానికి చెందిన రాధయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న కట్టా లింగాల గ్రామానికి వెళ్లి చావా భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్దబోయిన మల్లేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోట్రు ప్రవీణ్, చిన్న కోరుకొండి సొసైటీ అధ్యక్షులు చావా వెంకటేశ్వరావు, మాజీ గ్రామ సర్పంచ్ గంగవరపు వెంకటేశ్వరావు (శ్రీనివాసరావు), మాజీ గ్రామ ఉప సర్పంచ్ సరాబు వెంకటేశ్వరరావు,యర్రబోయినపల్లి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పుసులూరి శ్రీనివాసరావు, కనకారావు దేవభక్తిని వీరరాఘవ చౌదరి,బల్దిశెట్టి గోపాల్, వివిధ గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.