వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేష్ యాదవ్ ఏకగ్రీవం
ఘట్ కేసర్, నవంబర్ 22 (విజయక్రాంతి) : గురుకుల్ వాకర్స్ అసోసియేషన్(Gurukul Walkers Association) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది అంకం సురేష్ కుమార్ యాదవ్(Ankam Suresh Kumar Yadav) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి విపశ్వర్ణ హనుమాన్ అయనను అధ్యక్షుడిగా ప్రకటించి శాలువాతో సత్యరించారు. అసోసియేషన్ 12 మందితో ప్రారంభమై ప్రస్తుతం 57 మంది సభ్యులతో కొనసాగుతోందని తెలిపారు. నూతన అధ్యక్షుడు సురేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కడప ఈశ్వర్, మాజీ అధ్యక్షుడు సార శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బేతాల నర్సింగ్ రావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.