స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ శ్రీనగర్ విద్యార్థిని ప్రతిభ
బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో వీ ప్రీతికశ్రీ అద్భుత ప్రదర్శన
ఖమ్మం, అక్టోబర్ 24(విజయక్రాంతి): ఖమ్మం స్థానిక శ్రీనగర్ కాలనీలో గల స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్(STEMSpark Resonance School) విద్యార్థిని డిస్ట్రిక్ట్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఖమ్మం వారు నిర్వహించిన సిటీ లెవెల్ స్కూల్స్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో(City-Level Schools Basketball Championship) వీ ప్రీతికశ్రీ పాల్గొ ని తన ఆటతో తన టీమ్‌ను గెలిపించడమే కాకుండా వ్యక్తిగతంగా అద్భుతమైన పదర్శన చేసి పేక్షకులను, బాస్కెట్‌బాల్ అసోసి యేషన్ వారిని ఆకట్టుకుంది ఆమె పతిభను గుర్తించి అసోసియేషన్ వారు మెడల్, మెరి ట్ సర్టిఫికెట్‌తో సత్కరించారు.
ఈ సందర్భంగా స్కూల్‌లో జరిగిన అభినందన సభ లో పాఠశాల డైరెక్టర్స్ కె.శ్రీధర్‌రావు, కృష్ణవేణిలు పాల్గొని మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ ఛాపియన్‌షిప్‌లో అత్యుత్తమ పదర్శన చేసి సత్తా చాటిన వీ ప్రీతికశ్రీని అభినందిస్తూ పతి విద్యార్థి విద్యతో పాటు తమలోని సహజసామర్థ్యాల మీద దృష్టి పెట్టాలన్నారు.
అందుకనుగుణంగా స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులను అన్నిరంగాలలో తీర్చిదిద్దుతూ భవిష్యత్తులో వారిని ఉన్నత శిఖరా లను అధిరోహించేలా చక్కటి ప్రణాళికలతో విద్యాబోధనకు కృషి చేస్తున్నామన్నారు. మా విద్యార్థులను ఇప్పటికే ఇన్‌స్పెయిర్ మానక్, సైన్స్ ఎగ్జిబిషన్‌లో, కరాటేలో రాష్ట, జాతీయస్థాయికి ఇంకా ఇతర అన్ని పోటీల లో అసాధారణ ప్రతిభతో ముందుకు తీ సుకెళ్తున్నామన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కె. సురేష్, ఖమ్మం బాస్కెట్‌బాల్ ఆర్గనైజింగ్ క మిటీ చైర్మన్ రమణ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విజేతను అభినందించారు.