రామాపురం గుట్ట బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
ఆలయ కమిటీ చైర్మన్ చెన్నయ్య.
కొల్లాపూర్ నవంబర్ 22: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని గుట్టపైన ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు(Sri Venkateswara Swamy Brahmotsavams) వచ్చేనెల డిసెంబర్ 22 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మని పోస్టర్లను ఆలయ కమిటీ చైర్మన్ చెన్నయ్య ఆదివారం రామాపురం గ్రామంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు(Sri Venkateswara Swamy Brahmotsavams) వచ్చే భక్తులకు(devotees) భోజనం సౌకర్యం త్రాగునీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శివ కుమార్ చార్మి. నాగపురి ఆంజనేయులు రాము యాదవ్. గండం శ్రీరామ్. బాల కృష్ణ. రాము గ్రామ ప్రజలు పాల్గొన్నారు.